పునర్ నిర్మాణానికి బలమైన మద్దతు అవసరం: ప్రిన్స్ సుల్తాన్
- April 07, 2017
సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్‌సిటిహెచ్) ఛైర్మన్, ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ జెడ్డా చారిత్రక ఫెస్టివల్ అతారీక్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్నీ, పెవిలియన్స్‌నీ సందర్శించారు. చారిత్రక జెడ్డా పునర్ నిర్మాణానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు అవసరమని అన్నారాయన. జెడ్డాలోని వందలాది హెరిటేజ్ సైట్స్‌ని ఆధునీకరించేందుకు, అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు 30 ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నేషనల్ హెరిటేజ్‌ని సంరక్షించడంలో మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషా బిన్ మజెద్ కృషి చేస్తున్నారని కొనియాడారాయాన. ఫెస్టివల్స్ సుప్రీం కమిటీ, చారిత్రక జెడ్డా ప్రాంతాన్ని ఆర్కియాలజీ, హిస్టరీ పరంగా పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రిన్స్ సుల్తన్ చెప్పారు. అతారీక్ ఫెస్టివల్‌ని పాలస్తీనా కాన్సుల్ జనరల్ మహమ్మద్ అస్సాది, ఇరాక్ కాన్సూల్ జనరల్ ఖాలిద్ ఖైరో సందర్శించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







