దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్
- April 07, 2017
మనామా: వరల్డ్ జ్యుయెలర్స్ అధిపతి రజనీకాంత్ ఫిచ్చాదియాపై దాడి చేసి, అతన్నుంచి 13,000 బహ్రెయినీ దినార్స్ విలువైన బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ ఈ కేసును ఛేదించింది. అరెస్టు చేసిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. మార్చి 28వ తేదీన ఈ దొంగతనం జరిగింది. నలుగురు దుండగులు, జ్యుయెలరీ షోరూం వద్ద నిలుచుని ఉన్న రజనీకాంత్‌పై దాడి చేశారు. బంగారాన్ని దొంగిలించిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల అరెస్ట్‌పై తనకు అధికారుల నుంచి సమాచారం అందిందనీ, ఈ కేసులో నిందితుల్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు డిపార్ట్‌మెంట్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రజనీకాంత్ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







