ఆరోగ్యానికి ఆయుర్వేద సూత్రాలు ..!!
- September 29, 2015
సహజంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం. అంతే కాదు, ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమైన విషయమే. మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం సరిగా ఉన్నట్లైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తగినన్ని ప్రోటీనులు, న్యూట్రీషియన్స్, ఫైబర్ మరియు ఇతర మినిరల్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు, జీర్ణ సమస్యలు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాంతో మన జీవితి కాలంను మరికొంత పెంచుకోవచ్చు. ఆహారంను ఎలాతింటే, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ లాభం! మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో మంచి పోషకాహారం లేనప్పుడు జీర్ణ సమస్యలు మరియు పొట్టలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది . ఈ క్రింది తెలిపిన ఆహారపు అలవాట్లను అనుసరిస్తు మంచి ఆహారంను ఎంపిక చేసుకొన్నట్లైతే పొట్ట సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. మరి అందుకు అవసరం అయ్యే సూచనలేంటో ఒకసారి చూద్దాం.బాగా నమిలి తినాలి: మీరు ఏ ఆహారం తీసుకొన్నా బాగా నమిలి మ్రిగాలన్న విషయం గుర్తించుకోవాలి. భోజనం చేసే సమయంలో టీవీ చూడటం లేదా ఎక్కువగా మాట్లాడటం లేదా పుస్తకాలు, పేపర్లు చదవడం వంటి చేయకూడదు. భోజనం చేసేప్పుడు ఎలాంటి కోల్డ్ డ్రింక్స్ త్రాగకూడదు. ఇది జీర్ణక్రియను బలహీనంగా మార్చుతుంది. భోజనం సమయంలో డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ మరియు ఇతర బెవరేజస్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను బలహీనపరచడంతో పాటు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు, చాలా పొడిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వేడిగా మరియు మెత్తగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరియు కొద్దిగా రెడ్ వైన్ తీసుకొన్న సమస్య ఉండదు. మంచి ఆహారాన్ని తాజాగా ఉన్న వెజిటేబుల్స్ తో ఇష్టంగా తయారుచేసిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తినడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. రెస్టారెంట్, హోటల్లో ఎవరో తయారుచేసిన ఆహారం కంటే మన ఇంట్లో మన ప్రియతములు మనకు నచ్చిన ఆహారం చేసినప్పుడు ఇష్టం తినడం మంచిది. భోజనం సమయంలో కోపంతోనూ....భయంతోనూ...తినకుండా.. ఒక నిముషం రిలాక్స్ అయ్యి తర్వాత తినడం ప్రారంభించండి. అలాగే భోజనం చేసిన తర్వాత మీరు ఏం చేయాలనుకొన్ని ఒక 5 నిముషాలు గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అయ్యి తిరిగి ప్రారంభించండి. భోజనం ప్రతి రోజూ 3 లేదా 4 సార్లు తక్కవు క్వాంటిటీతో తీసుకోవాలి. మీరు తీసుకొన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కనీసం 3 గంటల వ్యవధి గ్యాప్ ఉండేట్లు చూసుకొని, వేరే ఇతర ఆహారాలను తీసుకోవాలి. మధ్యహ్నాన సమయంలో జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది . కాబట్టి మద్యహ్నాన సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం మరియు రాత్రి తీసుకొనే ఆహారం లైట్ గా ఉండాలి.. 11. నీళ్ళు మరియు నీళ్ళు మరియు డ్రింక్స్ రూమ్ టెంపరేచర్ లో తీసుకోవాలి . అతి చల్లని ఆహారపదార్థాలైనా, లేదా డ్రింక్స్ అయినా జీర్ణక్రియను పాడుచేస్తుంది మరియు అజీర్తా సమస్యలకు గురిచేస్తుంది. ఇది నిజం ఇది మీల్ టైమ్ లోనే కాదు, రోజంతా కూడా అలాగే ఉంటుంది ప్రతి భోజనానికి కనీసం మూడు గంట వ్యవధి వ్యత్యాసం ఉండాలి. కొంత మంది రోజులో మూడు నుండి నాలుగు సార్లు భోజనం చేస్తుంటారు. అలాంటప్పుడు క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









