పదవి పంపకాలు చేసిన చంద్రబాబు..!
- September 29, 2015
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా ప్రకటిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలను చంద్రబాబునాయుడు బుధవారం ప్రకటించారు. ఈ సంవత్సరం మేనెలలో నిర్వహించిన మహానాడు సందర్భంగానే రెండు రాష్ట్రాలకు రెండు కమిటీల ప్రకటన ఆ సభల్లోనే ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే నాలుగునెలల సుదీర్ఘమైన కసరత్తు తర్వాత.. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. కొన్ని నెలలనుంచి ప్రచారంలో ఉన్న పేర్లతోనే చంద్రబాబునాయుడు పార్టీ కమిటీలను ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఉంటారు. కేంద్ర కమిటీ కార్యదర్శలుగా నారా లోకేష్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొనకళ్ల నారాయణలను నియమించారు. కేంద్రకమిటీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి రామ్మోహనరావు, డికె సత్యప్రభ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉంటారు. కోశాధికారి బాధ్యతలు శిద్ధ రాఘవరావుకు అప్పగించారు. రాష్ట్ర కమిటీల విషయానికి వస్తే.. కొత్త ట్విస్టులు ఏమీ లేవు. తెలంగాణ కమిటీ అధ్యక్షుడుగా ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. ఏపీ తెదేపా అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు ఖరారయ్యారు. కేంద్ర మీడియా కమిటీ కన్వీనర్‌గా ఎల్వీఎస్సార్కే ప్రసాద్, కేంద్ర కమిటీ సమన్వయ కర్తగా టీడీ జనార్దన్, క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా ఏంఏ షరీఫ్ లను నియమించారు. ఇంకా కేంద్రకమిటీతో పాటూ, రెండు రాష్ట్రాల పూర్తిస్థాయి కమిటీలను చంద్రబాబునాయుడు ప్రకటించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







