భారత్‌తో ఇజ్రాయిల్ 2 బిలియన్ డాలర్ల ఒప్పందం
- April 08, 2017
ఇజ్రాయిల్ భారత్‌తో 2 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌కి ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన నేవీ, ఆర్మీ క్షిపణులను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం చేసుకొన్నట్లు ఐఏఐ(ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్) గురువారం వెల్లడించింది. ఇజ్రాయిల్ చరిత్రలో ఇంతటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఐఏఐ వాటా 1.6 బిలియన్ డాలర్లు. మిగతా మొత్తం మరో దేశానికి చెందిన రాఫెల్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ బరాక్ 8 (మీడియం రేంజ్ క్షిపణి), లాంగ్ రేంజ్ క్షిపణులను భారత్‌కు సరఫరా చేయనుంది. బరాక్ 8 క్షిపణులు 50 నుంచి 70 కి.మీ.ల వరకు డ్రోన్లను, వైమానిక దాడులను తిప్పికొట్టగలదు.
ఈ ఒప్పందాన్ని బట్టి చూస్తే ఐఏఐ ఆధునిక టెక్నాలజీపై, సామర్థ్యాలపై భారత ప్రభుత్వానికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోందని ఐఏఐ సీఈవో జోసెఫ్ వీస్ మీడియా ద్వారా తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







