పశ్చిమ మయన్మార్‌లో పెళ్లి పడవ మునిగి 20 మంది మృతి
- April 08, 2017
పెళ్లి పడవ నది వంతెనను ఢీకొట్టడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమ మయన్మార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 మంది ప్రయాణిస్తున్న ‘సిల్వర్ స్టార్’ అనే పడవ పథేన్ దగ్గరలోని నది వంతెనను శుక్రవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 16 మంది మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. కనీసం తొమ్మిది మంది గల్లంతయ్యి ఉంటారని, 30 మందిని రక్షించామని స్థానిక ఎంపీ ఆంగ్ తు హెట్వే తెలిపారు.
మయన్మార్‌లో పడవ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబరులో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన పడవ అధిక లోడ్ కారణంగా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో 73 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







