ఈతకొలనులో బట్టలుకుతున్న కూలీల అరెస్ట్‌

- September 29, 2015 , by Maagulf
ఈతకొలనులో బట్టలుకుతున్న కూలీల అరెస్ట్‌

ఓ ఫామ్‌హౌస్‌లో గల స్విమ్మింగ్‌ పూల్‌లో బట్టలు ఉతుకుతున్న వలస కూలీల్ని అరెస్ట్‌ చేసినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ వెల్లడించింది. ఓ లాండ్రీ కోసం ఆ కూలీలు స్విమ్మింగ్‌ పూల్‌లో బట్టలు ఉతుకుతున్నట్లు గుర్తించారు. దాంతో సదరు లాండ్రీని సైతం మూసివేశారు. సీబ్‌లో కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జియాద్‌ అల్‌ వహాబీ చెబుతూ, కన్స్యూమర్‌ చట్టంలోని ఆర్టికల్‌ 3ని వలస కూలీలు ఉల్లంఘించరని అన్నారు. బట్టల్ని స్విమ్మింగ్‌ పూల్‌లో ఉతకడం ద్వారా స్విమ్మింగ్‌ పూల్‌ని వినియోగించేవారి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దోఫార్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వలస కూలీని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. లైసెన్స్‌ లేకుండా లాండ్రీ నడుపుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com