యు.ఏ.ఈ లో 'గల్ఫ్' సినిమాకు ప్రమోషనల్ అంబాసిడర్ల నియామకం

- April 09, 2017 , by Maagulf

గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కు యు.ఏ.ఈ లో పలువురిని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ప్రమోషనల్ అంబాసిడర్లగా నియమించారు.ఇంకా వేరే ఎమిరేట్స్ మరియు దేశాల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి.
త్వరలో మాగల్ఫ్ ద్వారా వివరాలు తెలియజేస్తారు.

జనగామ శ్రీనివాస్ (షార్జా)
--------------------------

జనగామ శ్రీనివాస్ తెలంగాణ, రాజన్నహిల్స్, ముస్తాబాద్ కు చెందినవారు.ప్రస్తుతం షార్జా లో హెయిర్ సెలూన్స్ నిర్వహిస్తున్నారు.

జయ రెడ్డి బోడ(అబుధాబి)
-----------------------

జయ రెడ్డి బోడ తెలంగాణ, జగిత్యాల, మెయిడ్ పల్లికి  చెందినవారు. ప్రస్తుతం అబుధాబి లో అల్ ఒతైబా  & హందాన్ బుదెబ్స్ అడ్వొకేట్స్( లీగల్ కన్సల్టెంట్స్)లో సీనియర్ క్లర్క్ గా పనిచేస్తున్నారు.

అంబాసిడర్లగా నియమింపబడిన వారు గల్ఫ్ లో 'గల్ఫ్' చిత్రం గురించి అవగాహన కల్పించనున్నారు మరియు 'గల్ఫీ' ను ప్రమోట్ చేయనున్నారని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి వివరించారు.

ఈ సినిమాకు మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com