భార్య అనుమానాస్పద మృతి భర్త దుబాయ్‌లో
- April 10, 2017
బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.
వివరాలు.. గ్రామానికి చెందిన దాండ్ల లావణ్య(30) భర్త పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లాడు. ముగ్గురు పిల్లలతో లావణ్య గ్రామంలోనె నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన లావణ్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గ్రామ శివారులో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు రక్తపు మరకలను అనుసరించుకుంటూ వెళ్లడంతో.. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో బస్తాలో మూటకట్టిన మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







