కేరళ పాఠశాలల్లో ఇక మలయాళం బాష తప్పనిసరి
- April 11, 2017
కేరళలోని అన్ని పాఠశాలల్లో మలయాళం భాష బోధన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై ఈరోజు రాష్ట్ర గవర్నర్ సదాశివం సంతకం చేశారు. దీని ప్రకారం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో మలయాళం తప్పనిసరిగా బోధించాల్సిందే. హైయర్ సెకండరీ క్లాసుల వరకు మలయాళం కచ్చితంగా బోధించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో వెల్లడించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నిబంధనలు పాటించని పాఠశాలలు, ఉపాధ్యాయులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో అసలు మలయాళం బోధించడం లేదని తెలుసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







