బాలయ్యకు పదిలక్షలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్
- April 11, 2017
తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా వెలిగిపోయిన నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయిని రూమర్లు వచ్చాయి. అయితే వీటిని ఎన్టీఆర్ ఖండించారు..బాబాయి అంటే తనకు ఎంతో గౌరవం అని ఆయన గొప్ప నటులు అని ఖితాబు ఇచ్చారు. తాజాగా బాబాయికి అబ్బాయి పదిలక్షలు డొనేట్ చేసి మరోసారి తమ మద్య ఎలాంటి ఆంతర్యాలు లేవని చాటి చెప్పారు.
అసలు విషయానికి వస్తే..గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. అయితే జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ వాడిన బైక్ ని ఆక్షన్ కు పెట్టారు. ఆ బుల్లెట్‌ను తారక్‌కు వీరాభిమాని అయిన రాజ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి రూ.10 లక్షలకు వేలంలో దక్కించుకున్నాడు. అయితే.. ఆ మొత్తాన్ని బాలకృష్ణ నిర్వహించే బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి విరాళంగా అందజేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
అన్న మాట ప్రకారం ఆ పదిలక్షలు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి కి విరాళంగా ఇచ్చారు మైత్రి మూవీస్ అధినేతలు . బాలయ్య ని స్వయంగా కలిసిన వాళ్ళ లో జనతా గ్యారేజ్ చిత్ర నిర్మాతలతో పాటు దర్శకులు కొరటాల శివ కూడా ఉన్నారు. అయితే చెక్కును అందించేందుకు తారక్‌ను కూడా కొరటాల, నిర్మాతలు ఆహ్వానించినా.. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రాలేనని చెప్పాడట.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ బసవరమతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే . క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలందిస్తున్న బసవతారకం ఆసుపత్రి కి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







