దుబాయ్ ఎయిర్పోర్ట్ రికార్డు ట్రాఫిక్
- September 30, 2015
55 ఏళ్ళలో అత్యధిక ట్రాఫిక్ని దుబాయ్ విమానాశ్రయం నమోదు చేసింది. 7.3 మిలియన్ ట్రాఫిక్ ఆగస్ట్ నెలలో నమోదైంది. ఇది 55 ఏళ్ళ దుబాయ్ చరిత్రలోనే అతి పెద్ద ట్రాఫిక్‌గా అంచనా వేశారు. గడచిన 55 ఏళ్ళలో 700 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించింది. సరాసరి పెరుగుదల 15తో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ అంచనాల ప్రకారం ఇండియా టాప్ డెస్టినేషన్ కంట్రీ కాగా, బిజీయెస్ట్ డెస్టినేషన్‌గా ముంబై ఎంపికైంది. లండన్ టాప్ డెస్టినేషన్ సిటీగా ఉంది. 2014 ఆగస్ట్‌తో పోల్చితే 2015 ఆగస్ట్‌లో 34,773 విమానాలతో 11.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఏడాది కాలంలో తీసుకుంటే 18.1 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఫ్రైట్ వాల్యూమ్ పరంగా చూసుకుంటే ఆగస్ట్‌లో 207,427 టన్నుల సామర్థ్యంతోనూ ముందంజలో వుంది. గడచిన 2014 ఆగస్ట్‌తో పోల్చితే ఇది 5.3 శాతం అదనం. ప్రపంచంలోని వివిధ దేశాలతో, ముఖ్య నగరాలతో ఎయిర్ కనెక్టివిటీ కలిగి, అత్యధికంగా ప్రయాణీకులతో నిత్యం బిజీగా ఉంటోన్న దుబాయ్ విమానాశ్రయం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









