విలన్ పాత్ర పోషించనున్న నాగార్జున..!!
- October 01, 2015
ప్రయోగాలు చేయటంలో ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున తాజాగా నెగిటివ్ రోల్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడట. మరి నాగ్ చేయబోయే ఆ కొత్త ప్రయోగం ఏమిటో తెలుసుకుందాం. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున త్వరలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడా? అవుననే అంటున్నాయి చిత్రపురి వర్గాలు... జయం రవి హీరోగా ఇటీవలే రిలీజైన కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ఘన విజయాన్ని సాధించింది... ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అరవింద్ స్వామి. తను నటించిన విలన్ రోల్ ఈ సినిమాకు వెన్నెముక అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు... అందుకే ఈ మూవీ రీమేక్ లో నటించేందుకు హీరోలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తాడని వినిపిస్తోంది. తమిళంలో అరవింద స్వామి ప్లే చేసిన నెగిటివ్ రోల్ పట్ల నాగ్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ప్రతిభకు పట్టం కట్టడంతో పాటు ప్రయోగాలు చేయటంలో ఎప్పుడూ ముందుండే హీరో నాగార్జున. ఇప్పటికే హీరోగా నటించటంతో పాటు 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన నాగార్జున 'తని ఒరువన్' రీమేక్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రతో మరోసారి తన ప్రత్యేక చాటుకోవాలని భావిస్తున్నారట. తని ఒరువన్ రీమేక్ లో నాగ్ విలన్ గా కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ లో విలన్ పాత్రకి కింగ్ నాగ్గార్జున కంటే ముందు చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా తమిళంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తెలుగులోను కొనసాగిద్దామని చెర్రీ అండ్ టీమ్ భావించారు. ఆ తర్వాత రానా పేరు వినిపించింది.. ఒకానొక సందర్భంలో చెర్రీనే విలన్ పాత్రపై మక్కువ చూపిస్తున్నాడనీ అన్నారు. రీసెంట్ గా ఆ ప్లేస్ లోకి కింగ్ నాగార్జున వచ్చి చేరాడు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పై ఎవరూ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. డైరెక్షన్ విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన రాజానే తెలుగు వెర్షన్ కీ మెగా ఫోన్ పట్టుకుంటాడనీ వినిపిస్తోంది. మరి ఈ హిట్ మూవీలో చివరికి ఎవరు ఏ పాత్ర పోషిస్తారన్నది తెలియాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







