వృద్ధదంపతుల కోసం ఇతిహాద్ విమానం దింపారు
- April 16, 2017
ఒక్కసారి విమానం టేకాఫ్ అయ్యాక మళ్లీ ల్యాండ్ అయ్యేది గమ్యస్థానంలోనే. మధ్యలో ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే తప్ప వారి వ్యక్తిగత సమస్యల కోసం విమానాన్ని వెనక్కి తిప్పడం, ఆలస్యంగా బయలుదేరడం లాంటిది ఉండదు. కానీ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం వృద్ధ దంపతుల కోసం చేసిన సాయానికి ఇప్పుడంతా ఎతిహాద్ సంస్థని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం మాంచెస్టర్ నుంచి అబుదాబికి వెళ్లాల్సి ఉంది. విమానం మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన సెకన్లకే దానిలో ప్రయాణిస్తున్న వృద్ధదంపతులకు వారి మనవడి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే వారు విమాన సిబ్బందికి చెప్పి మనవడిని చూడాలనుంది అంటూ కన్నీరుపెట్టుకున్నారు.
వారి బాధ అర్థంచేసుకున్న సిబ్బంది ఈ విషయాన్ని పైలట్‌కి చెప్పడంతోటాకాఫ్ అయిన విమానాన్ని వెనక్కి మళ్లించాడు. వారి కోసం నిబంధనలకు వ్యతిరేకంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆపడమే కాకుండా వారు వెంటనే ఇంటికి చేరుకోవడానికి దగ్గరుండి క్యాబ్ ఏర్పాటుచేసి లగేజ్ పెట్టించి మరీ అబుదాబికి బయలుదేరారు. అంతేకాదు ఎతిహాద్ సంస్థ వారి టికెట్ క్యాన్సిల్ చేయ్యకుండా ఎప్పటికైనా వాడుకునే అవకాశం కూడా కల్పించింది. కానీ వారు మనవడిని చూసుకోవడానికి వెళ్లిన మరుసటి రోజే అతను చనిపోవడం బాధాకరం.
ఈ విషయాన్ని హిందీ బుల్లితెర నటుడు కుషాల్ టాండన్ తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఎతిహాద్ అంటే కలిసుండడం అని అర్థం అంటూ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







