మయన్మార్ ‘వాటర్ ఫెస్టివల్’ లో 285మంది మృతి
- April 17, 2017
మయన్మార్‌లో జరిగిన సంప్రదాయ వాటర్ ఫెస్టివల్లో 285 మంది మృతి చెందారు. నాలుగురోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మరో 1073మంది గాయపడ్డారు. మయన్మార్ కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ పేరు ‘థింగ్యాన్’. బౌద్ధ మతంను అనుసరిస్తూ ఈ ఫెస్టివల్ ను జరుపుతారు. గత ఏడాది చేసిన పాపాలు ఈ ఏడాది నూతన సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనేది మయన్మార్ ప్రజలు విశ్వసిస్తారు. రోడ్డు మీద వెళ్లే వారిపై లీటర్లకు లీటర్లు నీళ్లను కొడుతూ అక్కడి ప్రజలు ఈ వేడుకను ఘనంగా ముగించారు.
కాగా గత సంవత్సరం జరిగిన ఈ ఫెస్టివల్ సందర్భంగా 272 మంది చనిపోతే 1086మంది గాయపడ్డారు. అంటే ఈసారి మృతుల సంఖ్య 13 ఎక్కువ. ఈ సందర్భంగా 1200 క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 44 మంది వరకు మొత్తం 285 మంది చనిపోయారు. క్రిమినల్ కేసుల్లో హత్య, కారు యాక్సిడెంట్లు, డ్రగ్స్ వాడకం, దొంగతనాలు, హింస, ఆయుధాలు కలిగి ఉండడం వంటివి ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







