హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లలో కుళ్లిన మాంసం
- April 19, 2017
నగరంలోని పలు హోటళ్లను జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లలో తనిఖీలు చేసి భారీగా జరిమానా విధించారు. పాచిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన దిల్‌సుఖ్‌నగర్‌లోని శివాని హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్ నుంచి చెడిపోయిన ఆహారపదార్థాలను, కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వంటగది అపరిశుబ్రంగా ఉండడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని గ్రీన్ బావర్చి హోటల్, శిల్పి హోటళ్లకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. అదే విధంగా హోటల్ బృందావనంలో తనిఖీలు చేపట్టి పాడైన పదార్థాలను గుర్తించారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. జీహెచ్ఎంసీకి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్, వెటర్నరీ డాక్టర్, ప్రజారోగ్య శాఖ అధికారి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!







