కువైట్ లో 'గల్ఫ్' సినిమాకు మీడియా అంబాసిడర్ గా రాజశేఖర్ నియామకం
- April 19, 2017
గల్ఫ్ లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారు ఉపాధికోసం ఎడారి బాట పట్టినవాళ్ళు .. వారి జీవితాలపై రీసెర్చ్ చేసి శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా. ఇందుకోసం గల్ఫ్ దేశాలకు వారిని కలిసి.. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ నిర్మాత అధ్యయనం చేయడం జరిగింది. అంతే కాదు.. చాలా ఊళ్ళల్లో 40% మంది ఉపాథి కోసం గల్ఫ్ బాట పడుతూ ఉంటారు . వాళ్ళు తమ కుటుంబాలకు డబ్బు పంపడం.. కుటుంబాలకు అండగా నిలవడం ఇవన్నీ నిర్మాత దగ్గరనుండి చూసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇదొక యదార్థ జీవితాలకి సంబంధించిన కథల ఆధారంగా తీసిన సినిమా.
ఈ సినిమాకి మీడియా అంబాసిడర్ గా గుంటూరు నివాసి, కువైట్ లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న సంచలన అంతర్జాల పత్రిక అయిన కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ మరియు ఎపి ఎన్నార్టీ మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్, ఎన్నారై శ్రీ చప్పిడి రాజ శేఖర్ గారిని నియమించారు. గల్ఫ్ సినిమా గురించి ప్రొమోషన్, తదితర సంబంధిత విషయాలకు శ్రీ చప్పిడి రాజ శేఖర్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ అయిన శ్రీ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ మరియు ఎపి ఎన్నార్టీ మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్, ఎన్నారై శ్రీ చప్పిడి రాజ శేఖర్ గల్ఫ్ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ అయిన శ్రీ సునీల్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు







