నాని కొత్త సినిమాకి ముహూర్తం ఖరారు
- April 20, 2017
నాని మళ్లీ జోరు పెంచేశారు. గతేడాది మూడు సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన ఈసారి కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ‘నిన్ను కోరి’ చివరి దశకు చేరుకొంది. ఆ తర్వాత దిల్‌రాజు నిర్మాణ సంస్థలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ‘ఎమ్‌సీఏ’ చేయబోతున్నారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి... ’ అనే ఉపశీర్షికతో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. తాజాగా ‘ఎమ్‌సీఏ’ తర్వాత చిత్రానికి కూడా ముహూర్తం కుదిరినట్టు తెలిసింది. తనతో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలోనే నాని మరో చిత్రం చేయనున్నారు. ఆ చిత్రాన్ని ఆగస్టులో మొదలుపెట్టబోతున్నారు. హను ప్రస్తుతం నితిన్ కథానాయకుడిగా ‘లై’ తీస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







