దుబాయ్ రానున్న బాహుబలి టీం
- April 21, 2017
‘బాహుబలి’ చిత్ర బృందం ప్రచార కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడి సిటీ వాక్‌లోని రాక్సీ సినిమాస్‌లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క పాల్గొననున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలి సినిమా తెరవెనుక చేసే అద్భుతాల గురించి చూపించబోతున్నామని రోక్సీ సినిమాస్ ప్రతినిధులు తెలిపారు.
బాహుబలి చిత్రం బృందం దుబాయ్ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని డీసీటీసీఎం(దుబాయ్ కార్పొరేషన్ ఫర్‌టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) సీఈవో ఇస్సాం కాజిమ్ తెలిపారు. ఇలాంటి సినిమాలు దుబాయ్‌లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో 2020 నాటికి పర్యటకుల సంఖ్య 20 మిలియన్లకు చేరాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.
గల్ఫ్ లో ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దుబాయ్ మను తీసుకున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







