ముంబై ఫై ఆత్మాహుతి దాడులు చేస్తానంటున్న అరీబ్ మజీద్
- October 03, 2015
ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద ఆత్మాహుతి దాడులు చేస్తానంటూ సిరియా నుంచి తిరిగొచ్చిన అరీబ్ మజీద్ అనే యువకుడు ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఆ యువకుడు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. మజీద్ స్నేహితుడు ఫహీద్ షేక్ కూడా అతడితో కలిసి గత సంవత్సరం సిరియా వెళ్లిపోయాడు. అతడు కూడా ఐఎస్ఐఎస్ లో చేరేందుకే వెళ్లినట్లు సమాచారం. ఫహీద్ షేకే ఈ ట్విట్టర్ ఖాతాను నిర్వహించేవాడని అంటున్నారు. మజీద్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాడో తెలుసుకోండి.. అంటూ ట్వీట్లు మొదలయ్యాయి. అరీబ్ మజీద్ సోదరిని భారతీయ పోలీసులు తీవ్రంగా అవమానించారని, అందుకే వాళ్లమీద ప్రతీకారం తీర్చుకోడానికి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసేందుకు అతడు వస్తున్నాడని చెప్పారు. ఐఎస్ఐఎస్ లో మజీద్ సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని కూడా ఆ ట్వీట్ లో అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







