దుబాయిలో రుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న 2500 భారతీయులు
- April 22, 2017
దుబాయి: ఏప్రిల్ 21, 2017న దుబాయిలో ది ఇండియన్ ఎకాడమి ఆడిటోరియం నందున శ్రీకరంవారు నిర్వహించిన లఘు రుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణం ఆనందమయంగా కన్నుల పండుగలా జరిగింది. సాంప్రదాయ దుస్తులలో ఉత్తర దక్షిణ భారతీయులు పాల్గోనటం విశేషం. UAEలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మరియు వేరే ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు 2500 మంది ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
బ్రహ్మశ్రీ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు, మరియు శ్రీ వంశీకృష్ణ గారు కార్యక్రమాన్ని సాంప్రదాయబధ్ధంగా జరిపించారు. ప్రదోషం బృందంవారిచే రుద్ర నమకం తో ఆడిటోరియం మారుమ్రోగింది. మన హిందూ వివాహ విధి ధర్మం గురించి బ్రహ్మశ్రీ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఇచ్చిన వివరణ, శ్రీ మారుమాముల శశిధర్ గారి స్వరంలో భక్తిగీతాలు విని వచ్చినవారందరు చాలా సంతోషించారు.
రుద్రాభిషేకం చేయించుకున్న దంపతులకి పూజ సామగ్రి, వచ్చినవారందరికి భోజన ప్రసాదాలు, అన్నిసమయానికి జరిగేలా ఏర్పాట్లు బాగా చేసిన శ్రీకరం కార్యకర్తలు అభినందనీయులు. UAEలో ఉద్యోగాలు చేసుకుంటున్న భక్తిభావ స్వారూప్యం ఉన్న కార్యకర్తల అండతో శ్రీకరం భక్త బృందం వీలయినపుడల్లా మన భక్తి సాంప్రదాయాలకు తగ్గట్టుగా, స్వలాభం కోరుకోకుండా, తోటి ప్రవాస భారతీయుల కోసం కార్యక్రమాలు నిర్వహించాలి అని సంకల్పంచింది. వారు చేపట్టిన లఘు రుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణం చూసి ఆనందించిన భక్తులు కొందరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు:
- ఒక అద్భుతమయిన అనుభూతి...ఈ అలౌకిక ఆనందాన్ని కలుగచేసిన శ్రీకరంవారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
- దుబాయిలో ఉంటూ శివపార్వతుల కళ్యాణం చూడగలగటం మా అదృష్టం
- అంతమంది రుద్రం కలిసి చదువుతుంటే ...అద్భుతం
- వచ్చినవారు శ్రధ్ధగా ఈశ్వర పూజ చేసుకునేలా ఏర్పాట్ల లో ఎక్కడ లోటు లేకుండా చాలా బాగా నిర్వహించారు.
తమ సంకల్పాన్ని విజయవంతం చేసిన శ్రేయోభిలాషులకి, దుబాయి ప్రభుత్వానికి, స్పాంసర్లకి,మాగల్ఫ్.కాం వారికి మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకరం భక్తి బృందం ధన్యవాదాలు తెలుపుకున్నారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







