బాబాయ్ - అబ్బాయ్ పోటీ
- October 03, 2015
బాబాయ్ బాలయ్య- అబ్బాయ్ జూనియర్ ఇద్దరూ టీజర్స్ వార్ చేసుకున్నారు, తరువాత ఫస్ట్ లుక్స్ తోనూ పోటీ పడ్డారు... ఇప్పుడు ఏకంగా సినిమాలతోనే బాక్సాఫీస్ బరిలో దూకడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం... మరి అందులోని నిజమెంత?.. నందమూరి ఫ్యామిలీలో కొందరు సోదరుల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో వినిపిస్తోంది... గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న బాలకృష్ణ, హరికృష్ణ మధ్య ఇప్పుడు అంతటి సయోధ్య లేదన్నది అందరికీ తెలుసు... అలాగే బాలకృష్ణ, హరికృష్ణ తనయుడు జూనియర్ యన్టీఆర్ మధ్య కూడా పొసగడం లేదట... ఈ నేపథ్యంలోనే బాబాయ్, అబ్బాయ్ ఒకే సమయంలో టీజర్స్, ట్రయిలర్స్ తో పోటీ పడ్డారు... ఇప్పుడు ఏకంగా సినిమాలతోనే బాక్సాఫీస్ బరిలో దూకడానికి ఈ బాబాయ్- అబ్బాయ్ సిద్ధమవుతున్నారని సమాచారం... గత సంవత్సరం డిసెంబర్ 31న రాత్రి బాలకృష్ణ 'లయన్', జూనియర్ యన్టీఆర్ 'టెంపర్' చిత్రాల ట్రయిలర్స్ తో పోటీ పడ్డారు... మొన్న వినాయక చవితికి బాలకృష్ణ తాజా చిత్రం 'డిక్టేటర్' ఫస్ట్ లుక్ వస్తే, జూనియర్ యన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' అంటూ టైటిల్ లోగోను విడుదల చేశాడు... ఇలా మరోమారు ఈ బాబాయ్-అబ్బాయ్ పోటీ పడ్డారు... రాబోయే దసరాకు కూడా ఈ బాబాయ్-అబ్బాయ్ పోటీ పడనున్నట్టు సమాచారం... ఈ సారి అక్టోబర్ 22న దసరా పండుగ... అందువల్ల అక్టోబర్ 21 అర్ధరాత్రినే 'డిక్టేటర్' టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు... అదే రోజు జూనియర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా కొత్త షెడ్యూల్ స్పెయిన్ లో ప్రారంభం కానుంది... మరి ఇది పోటీ అవుతుందా?... దసరా రోజున కూడా ఏదో విధంగా బాబాయ్ బాలయ్యతో అబ్బాయ్ జూనియర్ పోటీ పడతాడని విశేషంగా వినిపిస్తోంది... అది అలా ఉంచితే, ఆ పోటీ ఈ సారి సినిమాల మధ్యనే ఉండబోతోందని వినిపిస్తోంది... ఇప్పటికే జూనియర్ తన 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని రాబోయే జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించాడు... బాలకృష్ణ 'డిక్టేటర్' కూడా సంక్రాంతికే రానుందనీ వినిపిస్తోంది... గతంలో ఈ బాబాయ్, అబ్బాయ్ టీజర్స్ తో పోటీ పడితే, వాళ్ళ సినిమాలు కూడా అలాగే వస్తాయనుకున్నారు... కానీ టెంపర్ ఓ సారి, లయన్ మరోసారి విడుదలయ్యాయి... అదే రీతిన ఈ సారి కూడా ఈ బాబాయ్, అబ్బాయ్ తమ సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటారనీ కొందరు భావిస్తుంటే మరికొందరు ఈ సారి పోటీ తప్పదని అంటున్నారు... ఏమవుతుందో చూద్దాం...
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







