వాట్సాప్ అడ్మిన్‌లూ.. జర జాగ్రత్త!
- April 23, 2017
వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అయినవారిని వారణాసిలోని ఉన్నతాధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెడితే.. సంబంధిత సోషల్ మీడియా గ్రూప్‌కు చెందిన అడ్మినిస్ట్రేటరే అందుకు బాధ్యలవుతారని అక్కడి జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) యోగేశ్వర్ రామ్‌మిశ్రా, ఎస్పీ నితిన్ తివారి వార్నింగ్ ఇస్తున్నారు. ఈమేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీచేశారు.
గ్రూపులో మతపరమైన విద్వేషాలకు దారితీసే కంటెంట్‌గానీ, తప్పుడు సమాచారంగానీ ఉన్న పక్షంలో సంబంధిత సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని, జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుందని ప్రకటించారు. తప్పుడు సమాచారం లేదా కల్పిత (మార్ఫ్ చేసిన) ఫోటోలను, ఒకరి ప్రతిష్టకు భంగం కల్పించే వీడియోల పోస్టింగులను నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ వారు పేర్కొన్నారు. గ్రూప్‌పై పోస్ట్ చేసే కంటెంట్‌కి అడ్మిన్లే బాధ్యులని స్పష్టం చేశారు. అయితే.. తమ గ్రూపుల్లో పోస్ట్ చేసే సమాచారానికి, వాట్సాప్ అడ్మిన్‌లు బాధ్యలు కారని గత ఏడాది ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం గమనార్హం.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







