ఘనంగా జ్యోతిక మగలీర్ మట్టుం ఆడియో వేడుక
- April 24, 2017
టాలీవుడ్ హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మగలీర్ మట్టుం. 1994లో రేవతి, ఊర్వశి, రోహినిల నటనలో విడుదలైన చిత్రం మగలీర్ మట్టుం ఉద్యోగాలకు వెళ్లే మహిళల ఇబ్బందుల నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అదే పేరుతో అటువంటి కథాంశంతోనే జ్యోతిక, శరణ్యా పొన్వన్నన్, ఊర్వశి, బానుప్రియ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న ‘కుట్రం కడిదల్’ చిత్ర దర్శకుడు బ్రహ్మ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా నిర్మించారు.
ఈ చిత్ర టీజర్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదేవిధంగా ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య తన ట్విటర్లో విడుదల చేశారు. ఈ స్థితిలో మగలీర్ మట్టుం ఆడియోను విడుదల చేశారు. కార్యక్రమంలో సూర్య, కార్తీలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించడం విశేషం.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







