తమిళనాడు లో ప్రతిపక్షనేత స్టాలిన్‌ అరెస్టు

- April 25, 2017 , by Maagulf
తమిళనాడు లో ప్రతిపక్షనేత స్టాలిన్‌ అరెస్టు

ప్రతిపక్షాల బంద్‌ కారణంగా తమిళనాడు ఉద్రిక్తంగా మారింది. తిరువూరులోని కావేరీ డెల్టా ప్రాంతంలో బంద్‌లో పాల్గొన్న డీఎంకే నేత స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేసి, ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్భందించారు. దీంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్టాలిన్‌తో పాటు సీనియర్‌ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి బాలును కూడా అదుపులోకి తీసుకున్నారు.
తమ రాష్ట్రానికి కరవు భత్యం ఇవ్వాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తమిళనాడు రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో రైతులకు మద్దతుగా నేడు తమిళనాడులో బంద్‌ చేపట్టారు. అయితే దీన్ని అఖిలపక్ష బంద్‌గా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మరికొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే తదితర పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి. తమిళనాడు వర్తకుల సమాఖ్య, వ్యాపారుల సమాఖ్య, రవాణా కార్మికుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. 10వేల పెద్ద, చిన్న హోటళ్లు మూతపడ్డాయి. దీంతో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వేల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com