త్వరలో వ్యవసాయాధికారులకు ల్యాప్‌టాప్‌లు
- April 25, 2017
తెలంగాణలో ఎక్కువ మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఎరువుల కోసం ఇచ్చే నగదు, క్రాప్ కాలనీల ఏర్పాటు విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘వ్యవసాయం రంగంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల నేటి తరాలకు దానిపై ఆసక్తి తగ్గుతోంది. ఒకప్పుడు ఎందరినో ఆదుకున్న రైతు నేడు విధిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఆర్థిక ప్రగతి తెలంగాణలో ఉంది. కేంద్ర లెక్కల ప్రకారమే వృద్ధిరేటు 19శాతంగా ఉంది. ఇంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నష్టాలు ఎందుకు ఉండాలి. నా చిన్నప్పుడు వ్యవసాయానికి ఖర్చే ఉండేది కాదు. రైతు బాగుపడేందుకు ఇప్పుడు ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి.
వ్యవసాయ శాఖలో ఇప్పటికే 2వేల మందిని నియమించాం. మరో 500 మందిని తీసుకుంటాం. వ్యవసాయ అధికారులకు వెంటనే ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తాం. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన ముందడుగు పట్ల ఇతర రాష్ట్రాలు అభినందిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణీలకు అవసరం లేకున్నా సిజేరియన్లు చేసి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు’ అని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







