తమిళనాడు లో ప్రతిపక్షనేత స్టాలిన్ అరెస్టు
- April 25, 2017
ప్రతిపక్షాల బంద్ కారణంగా తమిళనాడు ఉద్రిక్తంగా మారింది. తిరువూరులోని కావేరీ డెల్టా ప్రాంతంలో బంద్‌లో పాల్గొన్న డీఎంకే నేత స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేసి, ఓ ఫంక్షన్ హాల్లో నిర్భందించారు. దీంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్టాలిన్‌తో పాటు సీనియర్ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి బాలును కూడా అదుపులోకి తీసుకున్నారు.
తమ రాష్ట్రానికి కరవు భత్యం ఇవ్వాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో రైతులకు మద్దతుగా నేడు తమిళనాడులో బంద్ చేపట్టారు. అయితే దీన్ని అఖిలపక్ష బంద్‌గా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మరికొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే తదితర పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి. తమిళనాడు వర్తకుల సమాఖ్య, వ్యాపారుల సమాఖ్య, రవాణా కార్మికుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. 10వేల పెద్ద, చిన్న హోటళ్లు మూతపడ్డాయి. దీంతో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వేల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







