షార్జా లో ఎత్తైన భవనం నుంచి కింద పడీ మరణించిన 30 ఏళ్ళ వ్యక్తి
- April 28, 2017
షార్జా: నిర్మాణ దశలో ఉన్న 20 అంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకి ఓ ముప్పయేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. షార్జా ఆల్ మజాజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసు అధికారి "మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తమ దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. అత్యవసర అధికారులకు సమాచారం తెల్సుకొని ఘటనా స్థలంకు వెళ్లారు. ఆ వ్యక్తి సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని షార్జా పోలీసులు ధృవీకరించారు. 20 అంతస్థుల ఎత్తయిన భవనం నుంచి అనూహ్యంగా మరణించాడు.ప్రమాదం గురించి పోలీసులకు తెల్సిన వెంటనే, క్రిమినల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) బృందం ఆ సన్నివేశానికి పంపబడింది. మృతదేహాన్ని గురువారం ఉదయం 6 గంటలకు అల్ కువైట్ ఆసుపత్రికి బదిలీ చేసారు, అప్పటికి మృతదేహం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. మరణించిన వ్యక్తి మరణం మిస్టరీ ఇంకా తెలియాల్సి ఉంది..అది ఆత్మహత్య లేక హత్య అనే విషయం విచారణలో ఇంకా తెలియాల్సిఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







