రోడ్డు ప్రమాదంలో టీవీ యాంకర్ మృతి.. నటుడికి గాయాలు
- April 29, 2017
పశ్చిమ్‌బంగలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోడల్ సోనికా చౌహాన్ మృతిచెందింది. అదే కారులో వెళ్తున్న నటుడు విక్రమ్ ఛటర్జీ గాయపడ్డారు. వీరిద్దరూ కలిసి ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున డివైడర్‌ను ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సోనికా మృతిచెందింది. విక్రమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. విక్రమ్ బుల్లితెర నటుడు కాగా.. సోనికా మోడలింగ్‌తో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో యాంకర్‌గా పనిచేస్తోంది. ప్రమాద సమయంలో విక్రమ్ కారు నడుపుతున్నట్లు సమాచారం. అతి వేగానికి తోడు, కారులోని ఎయిర్‌బ్యాగులు సకాలంలో తెరుచుకోకపోవడంతో ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









