భారత్- బ్రిటన్ హాకీ మ్యాచ్ డ్రా
- April 29, 2017
ప్రతిష్టాత్మకమైన ఆజ్లాన్ షా హాకీ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్ డ్రాతో గట్టెక్కింది. శనివారం బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. తొలుత మ్యాచ్ పట్టు బిగించిన భారత ఢిపెండర్లు నాలుగో క్వార్టర్‌లో అదే జోరు కొనసాగించలేకపోవడంతో చివరి నిమిషంలో ఫెనాల్టీ కార్నర్‌తో ఓటమి నుంచి గట్టెక్కింది. 19 నిమిషంలో ఆకాశ్ దీప్ ఫెనాల్టీని గోల్‌గా మలచి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. 25వ నిమిషంలో కార్లసన్ బ్రిటన్ తరపును గోల్ చేసి 1-1తో స్కోర్లను సమం చేశాడు. మళ్లీ 48 నిమిషంలో మణిదీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి బ్రిటన్‌పై భారత్‌కు 2-1 ఆధిక్యం సాధించాడు. అయితే భారత్‌ను నిలువరించి బ్రిటన్ మళ్లీ పుంజుకుని 52 నిమిషంలో అలెన్ గోల్ చేసి 2-2తో సమం చేశాడు. అయితే చివరి నిమిషంలో బ్రిటన్ ఫెనాల్టీని భారత్ నిర్వీర్యం చేయడంతో డ్రాతో గట్టెక్కింది. ఎనిమిది రోజుల పాటు ఈ సాగే టోర్నీలో భారత్‌తో పాటు బ్రిటన్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర ఐదు దేశాలో బరిలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో సాగే ఈ టోర్నీలో పాయింట్లు ఆధారం ఫైనల్‌కు జట్లు చేరుకుంటాయి.
ఈ ఏడాది పాకిస్తాన్ టోర్నీలో పాల్గొనలేదు. గతేడాది తొమ్మిదేళ్ల ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత్ రన్నరప్ సాధించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







