అమెరికాలోని టెక్సాస్ లో బీభత్సం సృష్టిస్తోన్న భారీవర్షాలు, వరదలు
- May 01, 2017
అమెరికాలోని టెక్సాస్ లో భారీవర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు బలమైన టోర్నడోలు, మరోవైపు వరదల కారణంగా టెక్సాస్ లోని మధ్యప్రాంతం అతలాకుతలమైంది. ప్రకృతి విపత్తుకారణంగా పలువురు మరణించారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. దీంతో మిస్సోరి, ఒక్లహోమా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్... సహాయకచర్యలను ముమ్మరంచేసినట్లు తెలిపారు. భారీ వర్షానికి మిస్సోరిలో ఒకరు, టెక్సాస్, కాంటన్ ప్రాంతాల్లో 5గురు మరణించినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి బ్రిన్ హార్టన్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 30కి పైగా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని సహాయక అధికారులు తెలిపారు. వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









