ఒమన్ నుంచి దుబాయ్‌కి 1 మిలియన్ విజిటర్లు
- May 01, 2017
ఇన్‌బౌండ్ టూరిజంకి సంబంధించినంతవరకు ఒమన్ నాలుగో స్థానంలో నిలిచింది. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (దుబాయ్ టూరిజం) ఇడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016లో దుబాయ్‌లో పర్యటించినవారిలో ఒమన్‌కి 4వ స్థానం దక్కింది. 1 మిలియన్ విజిటర్స్ దుబాయ్‌ని సందర్శించిన వారిలో (ఒమన్ నుంచి) ఉన్నారు. ఇండియా నుంచి అత్యధికంగా 1.8 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించగా, సౌదీ అరేబియా 1.6 మిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం 1.2 మిలియన్ విజిటర్లతో యూకే నిలిచింది. జిసిసి దేశాల నుంచి 3.4 మిలియన్ల మంది దుబాయ్‌ని సందర్శించారు. ఇది 2015తో పోల్చితే 5 శాతం అదనం. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, ఖతార్ జిసిసి దేశాల నుంచి దుబాయ్‌కి అత్యధికంగా వెళ్ళినవారి లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







