యూపీ లో దారుణం అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే 21 వేల జరిమానా
- May 03, 2017
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో పంచాయతీ తీర్పులు కలకలం రేపుతున్నాయి. భారత దేశం ఇచ్చిన రాజ్యంగ స్వేచ్ఛను హరించే విధంగా తీర్పులను వెలువరుస్తున్నాయి. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, లేడీస్ వీధుల్లో ఫోన్ వాడినా భారీ ఫైన్ విధించేలా మడోరా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ బుధవారం సంబంధిత ఆదేశాలు జారీచేసింది.
మడోరా గ్రామ కొత్త రూల్స్ ప్రకారం.. లేడీస్ స్ట్రీట్ లో ఫోన్ మాట్లాడుతూ... కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధించనున్నారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ అభిప్రాయపడింది. ఇక, గోవధకు పాల్పడినా.. ఆవులను దొంగతనం చేసినా రూ. 2లక్షల వరకు జరిమానా వేయనున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు చేపడితే.. రూ. 1.11లక్షల వరకు అపరాధ రుసుము కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తారట. శిక్ష ఏంటనేది పంచాయతీనే నిర్ణయం తీసుకుంటుందట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









