'బ్రూస్లీ' దసరా కానుక
- October 04, 2015
రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్లీ' దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోన్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ తన పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని శరవేగంగా పూర్తిచేస్తూనే మరోవైపుడబ్బింగ్ కూడా చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్‌తోపాటు మెగాస్టార్ చిరుకూడా ఓ మూడు నిమిషాలపాటు కనువిందు చేయనున్నాడు. ఆ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరో 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. 'ది ఫైటర్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నాడు. అతడి సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నదియా, రావురమేష్, కృతికర్బంద ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే రిలీజ్ అయి సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పాత్రలో కనిపించే ఈ సినిమా ఆడియోను ఆయన విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి 16న విడుదల చేస్తాం అన్నారు. (చిత్రం) రామ్‌చరణ్, నిర్మాత డివివి దానయ్య
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







