కారులోంచి దిగి బస్కెక్కుతావా... చావు.. కాల్చిపడేసిన భార్య..
- May 06, 2017
అసలే కోతి.. ఆపై కల్లు దాగింది. తర్వాత చెట్టెక్కింది.. ఆపై పూనకం వచ్చింది అనేంత రేంజిలో ఒక భార్య పుల్లుగా తాగి భర్తతో గొడవ పడి మూడు సార్లు కాల్చిపడేసింది. చావుబతుకుల మధ్య అతడు ఆసుపత్రిలో ఉంటే పోలీసులు ఈ కేసును ఎలా తేల్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద చోటు చేసుకుంది. హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు.
సాయిరామ్(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు.
మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు. ఇక అంతే.. ఆగ్రహించిన భార్య కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి.
స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్‌కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









