హీరో నాని 'ఎంసీఏ' ప్రారంభం
- May 06, 2017
వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ కథానాయకుడు నాని ‘ఎంసీఏ’కు శ్రీకారం చుట్టారు. సినిమాలతో బిజీబిజీగా ఉన్న నాని ఇప్పుడు ఎంసీఏ చదవడం ఏంటా? అని అనుకుంటున్నారా? ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పేరది. శనివారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు వంశీ పైడిపల్లి నాని సినిమాకు క్లాప్ కొట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో నటుడు నరేష్, ఆమని, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. నాని నటించిన మరో చిత్రం ‘నిన్నుకోరి’ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్ కథానాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









