ఛాంపియన్స్ ట్రోఫికి టీం ఇండియా ఆడనుంది
- May 07, 2017
ఎట్టకేలకు సందిగ్దత తొలగింది. ఛాంపియన్‌ట్రోఫీలో టీం ఇండియా ఆడనుంది. ఇటీవల ఐసీసీతో వచ్చిన విభేదాల కారణంగా టీం ఇండియా ఛాంపియన్స్ట్రోఫిలో ఆడుతుందా లేదా అనే అనుమానం క్రికెట్ అభిమానులను తొలిచివేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 1నుంచి ఇంగ్లాండ్‌లో జరగనుంది.
తాజాగా బీసీసీఐ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందని ప్రకటించింది. దీంతో పాటు ఐసీసీకి ఎటువంటి నోటీసులు ఇవ్వకూడదని నిర్ణయించింది. నూతన ఆర్థిక విధానంతో బీసీసీఐ-ఐసీసీ మధ్య తలెత్తిన వివాదానికి మధ్యస్తం ద్వారా పరిస్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా జాయింట్ సెక్రటరీగా ఉన్న అమితాబ్ చౌదరికి ఈబాధ్యతలు అప్పగించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది.
‘ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం గత నెల 25లోపే భారత జట్టును ప్రకటించాల్సి ఉన్నా నేటి దాకా జట్టును వెల్లడించలేదు. వెంటనే సెలక్షన్ కమిటీని సమావేశపరిచి టీమిండియా జట్టును ప్రకటించాలని బీసీసీఐ సంయుక్త కార్యదర్శిని నూతన పాలక మండలి (సీఏవో) హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









