కిడ్నీ కొనుగోలు: లాహోర్‌లో ఇద్దరు ఒమన్ల అరెస్ట్
- May 08, 2017
ఇద్దరు ఒమన్ జాతీయుల్ని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. లాహోర్‌లో కిడ్నీల కొనుగోలుకు యత్నించారనే ఆరోపణల నేపథ్యంలో వీరి అరెస్ట్ జరిగింది. మొత్తం ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ కాగా, అందులో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. అక్రమంగా సర్జరీలు జరుగుతున్న ఓ ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులకు వీరుపట్టుబడ్డారు. ఈ గ్యాంగ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీల వ్యాపారం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ జామిల్ అహ్మద్ మాయో మాట్లాడుతూ, ఇద్దరు ఒమన్ జాతీయులకు అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుండగా నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుమారుగా 25,703 ఒమన్ రియాల్స్‌ని ఒక్కో కిడ్నీ కోసం ఇద్దరు ఒమనీయులు చెల్లించినట్లుగా విచారణలో పోలీసులు తేల్చారు. ఒమన్‌లో కిడ్నీ డోనర్స్ తక్కువగా ఉండటంతో, ఒమనీ కుటుంబాలు తమవారి కోసం ఏజెంట్లను వివిధ దేశాల్లో సంప్రదిస్తున్నారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అవయవదానం కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే చేయాలి. ఇతరులకు చేయడం నేరం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







