'బాహుబలి' 3 మరి ఇక రాదు అభిమానులకు చేదువార్త
- May 08, 2017
వెండితెరపై సంచలనాలు సృష్టించిన బాహుబలి సిరీస్ ఇక కొనసాగదా? అంటే అవుననే అంటున్నారు రచయిత కేవీ విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి 3’ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మూడో భాగం తెరకెక్కిస్తారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘బాహుబలి కథ ముగిసింది. మూడో భాగం లేదు. నేను, మా అబ్బాయి రాజమౌళి దీని గురించి ప్లాన్ చేయడం లేదు. ఈ పాయింట్ గురించి నేనేమీ రాయడం లేదు. అయితే కామిస్ సిరీస్, టీవీ మాధ్యమం ద్వారా బాహుబలి లెగసీ కొనసాగుతుంద’ని పీటీఐతో చెప్పారు.
దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ‘బాహుబలి 3’ ఉండదని ఇంతకుముందు వెల్లడించారు. బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ... బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ప్రేక్షకులను మోసం చేయలేనని అన్నారు. అయితే ఏదో ఒక రూపంలో బాహుబలి సిరీస్ కొనసాగుతుందని చెప్పారు. బాహుబలి మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే బాహుబలి 3 ఉండదన్న వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్









