ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 28 ఐటి కంపెనీలు

- May 08, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 28 ఐటి కంపెనీలు

ముందుకొచ్చిన ఎన్నారైలు 
- విశాఖ, అమరావతిలో ఏర్పాటు 
- డల్లాస్‌లో సిఇఒలతో సిఎం చంద్రబాబు సమావేశం 
- డెల్‌, బెల్‌ ప్రతినిధులతోనూ భేటీ 
అమెరికాలో ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న 28 ఐటి కంపెనీల యాజమాన్యాలు ఏపిలో తమ సేవల్ని ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం డల్లాస్‌లో అక్కడి ఎన్నారై ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమ య్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాల్లో తమ కంపెనీల కార్యకలాపాల్ని నిర్వహించేందుకు సిద్ధంగా వున్నామని ఈ సందర్భంగా ఎన్నారై ప్రతినిధులు సిఎంకు తెలిపారు. ప్రీమియర్‌, గ్లోబల్‌ ఔట్‌లుక్‌, టెక్‌ప్రోస్‌ సాఫ్ట్‌వేర్‌, ఆర్కస్‌ టెక్‌, శ్రీటెక్‌, మద్ది సాఫ్ట్‌, గురూస్‌ ఇన్ఫోటెక్‌, ఏఈ ఇన్ఫోటెక్‌, ఆక్టస్‌ తదితర కంపెనీలను ఏపిలో ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారని కొనియాడారు. స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డ్‌, స్మార్ట్‌ ఏపి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస భారతీయుల్ని ఆయన అభినందించారు. తమ శక్తి సామర్ధ్యాలను, విజ్ఞానాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలన్నారు. 
డెల్‌, బెల్‌ ప్రతినిధులతో భేటీ 
అమరావతిలోగాని, రాష్ట్రంలో ఎక్కడైనా డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని డెల్‌ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్య సిఎంకు తెలిపారు. అలాగే బెల్‌ హెలికాఫ్టర్‌ కంపెనీ ఏపిలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలిస్తు న్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ చాద్‌ స్పార్క్స్‌ వెల్లడిం చారు. పెట్టుబడిదారు లకు ఆకర్షణీ యమైన ఏవియేషన్‌ పాలసీని తీసుకొచ్చామని, తమ రాష్ట్రానికి వచ్చి అధికారులతో సంప్రదింపులు జరపాలని బెల్‌ డైరెక్టర్‌ను సిఎం కోరారు. 
అమరావతి స్కూల్‌ ఆఫ్‌ తెలుగు లింగ్విస్టిక్స్‌కు రూ.6 కోట్లు: సిఎం 
యూనివర్శిటీ ఆఫ్‌ సిలికానాంధ్రలో ' అమరావతి స్కూల్‌ ఆఫ్‌ తెలుగు లింగ్విస్టిక్స్‌' ఏర్పాటుకు రూ.6 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. మూడోరోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన బృందం సిలికానాంధ్ర యూనివర్శిటీలో పర్యటించింది. అక్కడ తెలుగు సంస్కృతి, భాషా సంరక్షణకు చేపట్టిన కార్యక్ర మాల్ని సిఎం కొనియాడారు. ప్రతి ఇంటిలోనూ ఒక కంప్యూ టర్‌ నిపుణుడు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, కూచిపూడి నాట్యకారుడు ఉండాలన్నారు. అమెరికా వ్యాపార, పరిపాలన రంగాల్లో ఆరితేరిన అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ప్రవాస భారతీయ సిఇఒలతో సిఎం బృందం సమావేశమ య్యింది. వ్యవసాయం, రవాణా, విద్య, వైజ్ఞానిక రంగాల్లో టెక్నాలజీని విస్తృతంగా ప్రవేశపెట్టామని సిఎం తెలిపారు. అగ్రి ప్రాసెసింగ్‌, అపరెల్‌, ఆక్వా రంగాల్లో ఏపిలో అపార అవకాశాలున్నాయన్నారు. ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com