ప్రయాణీకుల కోసం ఒమన్‌లో షేర్‌ ట్యాక్సీ

- May 08, 2017 , by Maagulf
ప్రయాణీకుల కోసం ఒమన్‌లో షేర్‌ ట్యాక్సీ

మస్కట్‌: మర్హాబా ట్యాక్సీ సర్వీసులు 'హోమ్‌ టు వర్క్‌' పేరుతో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నలుగురు వ్యక్తులు ట్యాక్సీని షేర్‌ చేసుకునేందుకు వీలుంది. 15 కిలోమీటర్ల వరకు 60 ఒమన్‌ రియాల్స్‌, 15 నుంచి 25 కిలోమీటర్ల దూరానికి 90 ఒమన్‌ రియాల్స్‌, 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు 150 ఒమన్‌ రియాల్స్‌, 45 నుంచి 50 కిలోమీటర్లకు 180 ఖతారీ రియాల్స్‌ నెలకు చెల్లించాల్సి ఉంటుందని మర్హాబా ట్యాక్సీ అధికారులు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం 75 ట్యాక్సీలను కలిగి ఉన్నట్లు వారు వివరించారు. సుల్తాన్‌ కుబూస్‌ పోర్ట్‌, హోటల్స్‌ వద్ద ట్యాక్సీలను నడిపేందుకు వీలుగా లైసెన్స్‌ పొందినట్లు మర్హాబా ట్యాక్సీ వర్గాలు వెల్లడించాయి. మొబైల్‌ యాప్‌ ద్వారా లేదా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేయడం ద్వారాగానీ ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు నెలవారీ కాంట్రాక్ట్‌ నిమిత్తం 'సైన్‌' అవ్వాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com