యూఏఈ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ
- May 08, 2017
షార్జాలోని ఓ సెలూన్లో 'సెల్ఫీ' గొడవ జరిగింది. ముగ్గురు అరబ్ మహిళలు, జిసిసి మహిళ ఒకరిపై దాడి చేశారు. ఓ పార్టీకి వెళ్ళేందుకోసం సెలూన్‌కి వచ్చిన మహిళలు, సెల్ఫీ తీసుకుంటుండగా ఈ గొడవ జరిగింది. జిసిసి మహిళ వెనకాల నిలబడి ఉన్న సమయంలో ఆ ముగ్గురు మహిళలు సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. సెలూన్ నిర్వాహకులు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా 'జగడం' ఆగలేదు. ఈ ఘటనలో జిసిసి మహిళ బొటనవేలికి గాయమయ్యింది. అలాగే ఆమె శరీరంపైనా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరబ్ మహిళలు తీసుకున్న సెల్ఫీలో తన ఫొటో ఉండడంపై జిసిసి మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దురుసుగా వ్యవహరించిన అరబ్ మహిళలు ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







