యూ.ఏ.ఈ లో పొగమంచు కారణంగా 88 యాక్సిడెంట్లు నమోదు

- October 05, 2015 , by Maagulf
యూ.ఏ.ఈ లో పొగమంచు కారణంగా 88 యాక్సిడెంట్లు నమోదు

యూఏఈని దట్టమైన పొగ మంచు ముంచెత్తింది. ఎయిర్‌పోర్టుల్లో విమానాలు ల్యాండ్‌ అవడానికి పొగమంచు ఆటంకం కలిగించింది. 3 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండ్‌ కాలేకపోయాయి. అలాగే రోడ్లపై వాహనదారులకూ పొగమంచు ఇబ్బందికరంగా మారింది. మొత్తం 88 యాక్సిడెంట్లు పొగమంచు కారణంగా నమోదయ్యాయి. 60 విమానాలు పొగమంచుతో ఆలస్యమయ్యాయి. అబుదాబీలో 30 విమానాలు ఆలస్యంగా ల్యాండ్‌ అయ్యాయి. షార్జా విమానాశ్రయంలో 17 విమానాల ల్యాండింగ్‌ ఆలస్యమయ్యింది. ఉదయం 4.15 నిమిషాల నుంచి 8.20 నిమిషాల వరకు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com