యూఏఈ రోడ్లు ప్రపంచలోనే మేటి
- October 05, 2015
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2015-2015 సందర్భంగా గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ ప్రకారం యూఏఈ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. రోడ్డు, రైలు రోడ్డు, పోర్ట్ మరియు ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో యూఏఈ అద్భుత ప్రగతి సాధిస్తోంది. యూఏఈ 2021 విజన్‌లో భాగంగా, దేశంలో అభివృద్ధి పనుల్ని వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా అలసత్వానికీ, అవినీతికీ తావులేకుండా చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా యూఏఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటటోంది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ డాక్టర్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బల్‌హైఫ్ అల్ నౌమి, యూఏఈ నాయకత్వాన్ని అభినందిస్తూ, దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపడానికి యూఏఈ నాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. ఎస్సెట్ ప్రిజర్వేషన్, మెయిన్‌టెనెన్స్ మేనేజ్‌మెంట్‌లోనూ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అవార్డుని యూఏఈ గెలుచుకుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







