స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేఝన్‌ గడువు పెంపు

- October 05, 2015 , by Maagulf
స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేఝన్‌ గడువు పెంపు

సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేషన్‌ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును అక్టోబర్‌ 15 వరకూ పొడిగించారు. అధికారిక సర్కులర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ది సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ జారీ చేసిన ఈ సర్కులర్‌ని పరిగణనలోకి తీసుకోవాలని స్వతంత్ర విద్యా సంస్థలు, వాటి నిర్వాహకుల్ని కోరింది. అక్టోబర్‌ 15 వరకూ ఎలాంటి అప్లికేషన్లనూ తిరస్కరించరాదని సర్కులర్‌లో పేర్కొంది. అప్లికేషన్ల స్వీకరణకు గతంలో నిర్దేశించిన గడువు సెప్టెంబర్‌ 30 కాగా, అక్టోబర్‌ 15 వరకు గడువును పొడిగించారు. 

 

--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com