ఏపీ మంత్రి నారాయణ కొడుకు మృతి, కారు నుజ్జునుజ్జు..

- May 09, 2017 , by Maagulf
ఏపీ మంత్రి నారాయణ కొడుకు మృతి, కారు నుజ్జునుజ్జు..

ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు మెట్రో స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి నారాయణ కొడుకు నిషిత్‌, అతడి ఫ్రెండ్ రాజా రవివర్మ వున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఇద్దరినీ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్‌ కారు(టిఎస్‌ 07ఎస్‌కే 7117)లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నప్పటికి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం ఉదయం మూడు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలోవున్న మంత్రి నారాయణ కొడుకు మరణవార్త విని షాక్‌కు గురయ్యారు. 22 ఏళ్ల నిషిత్.. నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతివేగం, సీటు బెల్టు ధరించక పోవడంతో కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. పోస్టు మార్టం తర్వాత నిషిత్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్‌లోని నారాయణ నివాసానికి తీసుకెళ్ల నున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు తరలిస్తారు. ఇటు లండన్ పర్యటనలోవున్న నారాయణ ఈ సాయంత్రం 8 గంటలకు చెన్నై చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన నెల్లూరు పయనమవుతారు. గురువారం ఉదయం నెల్లూరులో నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com