మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి
- May 09, 2017
మధ్యప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పెళ్లి బృందాలకు చెందిన 15 మంది మృతిచెందారు. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో పెళ్లికొడుకు కూడా ఉన్నాడు. ఖార్గోన్ జిల్లాలోని ఆగ్రా– ముంబై జాతీయ రహదారి మీద జరిగిన ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. కారును కంటైనర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఇండోర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
ధార్ జిల్లాలోని సిర్పీ గ్రామంలో వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరో ప్రమాదం షియోపూర్ జిల్లాలో జరిగింది. బాధితులంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







