బాలీవుడ్ నటి రాఖీకి నాన్ బెయిలబుల్ వారంట్
- May 12, 2017
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, రాఖీ సావంత్‌కు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విషవ్ గుప్తా ఈ కేసు విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.
ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గత ఏడాది జూలై 9న స్థానిక న్యాయవాది నరీందర్ అదియా, రాఖీ సావంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును ఏప్రిల్ 10న ఆమె ఉపసంహరించుకున్నారు. మార్చి 9న ఆమెపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయగా ఆమెను అరెస్టు చేయడానికి ఏప్రిల్‌లో ముంబై వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారుల బృందం ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









