ఉత్తర, ముహారక్ గవర్నరేట్స్ లో రెండు పాఠశాలలపై తీవ్రవాదుల దాడి

- May 13, 2017 , by Maagulf
ఉత్తర, ముహారక్ గవర్నరేట్స్ లో రెండు పాఠశాలలపై తీవ్రవాదుల దాడి

మనామ: ఉత్తర ముహరక్క్ గవర్నరేట్స్ పరిధిలోని రెండు పాఠశాలలపై  ఉగ్రవాదులు దాడి జరిగినట్లు విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది."అర్రాడ్ ప్రాథమిక బాలుర పాఠశాల మరియు కరనా ప్రాథమిక  బాలికల పాఠశాలలపై తీవ్రవాదులు దాడి చేశాయి, ఈ దాడితో ప్రభుత్వ పాఠశాలల్లో తీవ్రవాద దాడుల సంఖ్య 555 కు తీసుకువచ్చారని పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇస్లాం మతం మరియు అన్ని అంతర్జాతీయ సమావేశాలు మరియు మానవత్వ నియమాలకు విరుద్ధంగా పిల్లలను చదువుకోనీయకుండా విద్యకు వారి స్వాభావిక హక్కును పొందకుండా విద్యార్థులను అడ్డుకునే లక్ష్యంతో ఈ "అవమానకరమైన చర్యల" కొనసాగింపుకు వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ తన బలమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్రవాదులు ఆరాడ్ పాఠశాలలో చొరబడి, జిమ్నాజియం లోని  అద్దాల ద్వారాన్ని పగలగొట్టారు. అదేవిధంగా కరానాలో తరగతి గదుల్లో కిటికీలను రాళ్ళతో ధ్వంసం చేశారని  డైరెక్టరేట్ తెలిపింది, ఇటీవల జరిగిన ఈ సంఘటనలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు దాడుల గురించి భద్రతా అధికారులకు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com