సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు జోడీగా

- May 16, 2017 , by Maagulf
సూపర్‌ స్టార్‌  రజినీకాంత్‌ కు జోడీగా

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌ 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పా.రంజిత్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ధనుష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్‌ హీరోయిన్‌ ను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి. విధ్యాబాలన్‌ ను ఇక ఫైనల్‌ కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ డేట్స్‌ సర్ధుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో హుమా ఖురేషీను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. సూపర్‌ స్టార్‌ సరసన ఛాన్స్‌ రావడంతో ఈ బ్యూటీ బాగా ఎగ్జైట్‌ అవుతోందట. ఈ నెలాఖరు నుండి సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com